Jangaon: స్టేషన్ ఘన్‌పూర్‌లో దొంగ బంగారం కలకలం!

Jangaon: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ పరిధిలోని శివునిపల్లిలో శేఖర్ జ్యూయలర్స్‌లో తుకారాం గేట్ పోలీసులు సోదాలు నిర్వహించారు.

V Ravikiran, Jangaon
Published on: 15 Nov 2026 11:20 AM IST
Jangaon
X

Jangaon: స్టేషన్ ఘన్‌పూర్‌లో దొంగ బంగారం కలకలం!

Jangaon: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో శేఖర్ జ్యూయలర్స్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి దొంగిలించిన బంగారాన్ని గతంలో ఆ జ్యూయలర్స్ లో అమ్మినట్లు దొంగ చెప్పడంతో రికవరీ నిమిత్తం పోలీసులు ఆ షాపులో శనివారం సోదాలు నిర్వహించారు.

షాపులో ఉన్న బంగారం, నగదుతో పాటు హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమానిని విచారించేందుకు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన దొంగతనం కేసులో సికింద్రాబాద్ లోని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

దర్యాప్తులో భాగంగా దొంగ ఇచ్చిన సమాచారం మేరకు తుకారాం గేట్ పోలీసులు జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లికిలోని శేఖర్ జ్యూయలర్స్ లో తనిఖీలు చేసి, షాపు యజమానిని అదుపులోకి తీసుకుని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ లో విచారించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విచారణ తర్వాతే అసలు నిజాలు బయటపడనున్నాయి. గతంలో కూడా స్టేషన్ ఘన్‌పూర్ లో రెండు మార్వాడీ బంగారం తాకట్టు షాపులలో దొంగ బంగారం వ్యవహారం కలకలం రేపిన సంఘటన తెలిసిందే.

స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో పాన్ బ్రోకర్స్, మనీ లెండింగ్ వ్యాపారులు అధిక వడ్డీలతో సామాన్యుల నడ్డి విరుస్తూ అదనపు ఆదాయం సంపాదిస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. మార్వాడీ బంగారం తాకట్టు షాపులలో కనీసం అధికారులు తనిఖీలు నిర్వహించడం లేదనే గుసగుసలు వినబడుతున్నాయి.

V Ravikiran, Jangaon

V Ravikiran, Jangaon