Bhupalpally: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి!
Bhupalpally: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
Bhupalpally: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి!
Bhupalpally: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమ భవిష్యత్తుకు భరోసా కల్పించే ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను తిరిగి అమలు చేయాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
సీపీఎస్ విధానం వల్ల పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు ఆర్థిక భద్రత లేకుండా పోతుందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవలందించిన ఉద్యోగులకు వృద్ధాప్యంలో భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. cps ను రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం తో ఉద్యోగులంతా నమ్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు.
గతంలో అమలులో ఉన్న పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, ఉద్యోగులందరికీ ఓపీఎస్‌ను వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఈ సత్యాగ్రహ దీక్షలో జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.




