Warangal: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్: ఎస్సీ స్టడీ సర్కిల్!
Warangal: వరంగల్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌కు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వనున్నారు. అక్టోబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Warangal: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్: ఎస్సీ స్టడీ సర్కిల్!
వరంగల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో జారీ చేసిన సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) మరియు పోలీస్ కానిస్టేబుల్ (PC) ఉద్యోగ నియామకాలకు సంబంధించి, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అర్హులైన SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వరకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు...
అభ్యర్థుల ఎంపిక: స్టడీ సర్కిల్ నిబంధనలు, రిజర్వేషన్ రోస్టర్/రిజర్వేషన్ నిష్పత్తి మరియు డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది అని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ హనుమకొండ జిల్లా అధికారి బి నిర్మల , ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా గౌరవ సంచాలకులు డాక్టర్ కె జగన్ మోహన్ అన్నారు.
దరఖాస్తుతో సమర్పించవలసిన పత్రాలు:
1. SI / PC పోస్టులకు దరఖాస్తు చేసిన అప్లికేషన్ / అక్‌నాలెడ్జ్‌మెంట్ ఫారం SSC ,ఇంటర్మీడియట్
డిగ్రీ సర్టిఫికేట్ TC కులo ఆదాయo, రెసిడెన్షియల్ ఆధార్ కార్డు, అవసరమైన ఇతర ధ్రువీకరణ పత్రాలు అభ్యర్థులు తమ దరఖాస్తులను మరియు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్, RTC కాలనీ, వడ్డేపల్లి, హనుమకొండ నందు సమర్పించాలి.
దరఖాస్తుల స్వీకరణకు తేదీ: 06-10-2026 నుండి దరఖాస్తుల పరిశీలన సమర్పణకు చివరి తేదీ 10-10-2026 సాయంత్రం 5:00 గంటల వరకు సమర్పచలి. మరిన్ని వివరాల కోసం స్టడీ సర్కిల్ 9160606862




