Hanumakonda: పారిశుద్ధ్య కార్మికుల భద్రతే ముఖ్యం: కలెక్టర్ చాహత్
Hanumakonda: పారిశుద్ధ్య కార్మికుల భద్రతే ప్రధానమని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. గురువారం జీడబ్ల్యూఎంసీలో కార్మికులకు రక్షణ పరికరాలు పంపిణీ చేశారు.
Hanumakonda: పారిశుద్ధ్య కార్మికుల భద్రతే ముఖ్యం: కలెక్టర్ చాహత్
Hanumakonda: పారిశుద్ధ్య కార్మికుల భద్రతే అత్యంత ప్రాధాన్యత అని జిడబ్ల్యూఎంసీ స్పెషల్ ఆఫీసర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు.
గురువారం జిడబ్ల్యూ ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలెక్టర్ ఛాహాట్ బాజ్ పాయి, కమిషనర్ టి. వెంకన్నతో కలసి పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫార్మ్స్, యాప్రాన్లు, బూట్లు, గ్లౌజులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా యూనిఫార్మ్‌తో పాటు అప్రాన్ ధరించాలని, బూట్లు, గ్లౌజులు ఉపయోగించాలని సూచించారు. కార్మికుల ఆరోగ్యం, వ్యక్తిగత భద్రతను కాపాడటంలో రక్షణ పరికరాలు కీలకమని పేర్కొంటూ, వాటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వినియోగించాలని తెలిపారు.
కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ
విధి నిర్వహణలో ప్రతి కార్మికుడు తప్పనిసరిగా యూనిఫార్మ్‌తో పాటు రక్షణ పరికరాలను ధరించి, తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎం హెచ్ ఓ డాక్టర్ రాజేష్, సానిటరీ సూపర్వైజర్లు గోల్కొండ శ్రీను, భాస్కర్, శ్యామ్ రాజ్, అనిల్ కుమార్, భాస్కర్ సానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.




