Mahabubabad: మహబూబాబాద్‌లో రైతులకు కుసుమ విత్తనాల పంపిణీ!
Mahabubabad: మహబూబాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చేతుల మీదుగా రైతులకు కుసుమ విత్తనాలను పంపిణీ చేశారు.
Mahabubabad: మహబూబాబాద్‌లో రైతులకు కుసుమ విత్తనాల పంపిణీ!
Mahabubabad: మహబూబాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్ గారి చేతుల మీదుగా జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 20 ఎకరాల క్షేత్ర ప్రదర్శనకు కుసుమ (Safflower) విత్తనాలను పంపిణీ చేశారు.
నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–2026 పథకం ద్వారా నూనెగింజల పంటల సాగు, ఉత్పత్తిని పెంచడంతో పాటు రైతులను నూనెగింజల సాగు వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. విజయచంద్ర తెలిపారు. ఈ పథకం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డివిజన్ ఏడీఏ అజ్మీర శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి ఎన్. తిరుపతిరెడ్డి, ఏఈఓలు పున్నమి, వినుషా, ఏవో (టెక్నికల్) బి. రాంజీ, రైతులు , బావసింగ్, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




