Palakurthi: పాలకుర్తిలో ఘనంగా సమాచార హక్కు చట్టం 21వ ఆవిర్భావ దినోత్సవం!
Palakurthi: పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Palakurthi: పాలకుర్తిలో ఘనంగా సమాచార హక్కు చట్టం 21వ ఆవిర్భావ దినోత్సవం!
Palakurthi: పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో, సమాచార హక్కు చట్టం 21వ, ఆవిర్భావ దినోత్సవ వేడుకలను, సహ చట్టం పరిరక్షణ కమిటీ మండల అధ్యక్షులు గడ్డం వరుణ్ బాబు ఆధ్వర్యంలో, మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో, ఎంపీడీవో వేదావతి చేతుల మీదుగా కేక్ కట్ చేసి సహ చట్టం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎడవెల్లి సోమశేఖర్ మాదిగ, నాయకులు ఎడవెల్లి రమేష్, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.




