Parkal: పరకాలలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి

Parkal: హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 31 Oct 2026 4:31 PM IST
Parkal
X

Parkal: పరకాలలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి

పరకాల: పరకాల దేశ సమైక్యత, అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పరకాల కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ క్యాంపు కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.

ఆమె చిత్రపటానికి పట్టణ అధ్యక్షుడు ఒంటేరు శ్రావణ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ఐక్యత కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL