Mahabubabad: ఈనెల 13న చలో సెక్రటేరియట్ ముట్టడి: రేవా పిలుపు

Mahabubabad: రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిలు, డీఏలను ఏకమొత్తంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 13న చలో సెక్రటేరియట్ ముట్టడిని విజయవంతం చేయాలని రేవా పిలుపునిచ్చింది.

A.Rajkumar, Mahabubabad
Published on: 11 Oct 2026 3:09 PM IST
Mahabubabad
X

Mahabubabad: ఈనెల 13న చలో సెక్రటేరియట్ ముట్టడి: రేవా పిలుపు

Mahabubabad: ఈరోజు విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో రేవా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడమైనది. ఈ సమావేశమునకు మహబూబాబాద్ రేవా జిల్లా అధ్యక్షులు సంకా. బద్రి నారాయణ గౌరవాధ్యక్షులు సోమ గోవర్ధన్ గార్లు పాల్గొని మాట్లాడుతూ ఈనెల 13న చలో సెక్రటేరియట్ ముట్టడిని జిల్లాలోని పెన్షనర్స్ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరినారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపుమేరకు సచివాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టడం అయినది.

2024 మార్చి తర్వాత ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షనరీ బకాయిలను ఏక మొత్తంలో అందరికీ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు ఇప్పటికీ వైద్య ఖర్చులు అందక 127 మంది ఉద్యోగులు మరణించడం జరిగింది.

2024 జూన్ నుండి ఉద్యోగ విరమణ పొందిన అందరికీ ఇవ్వవలసిన నగదు రూపంలో చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇప్పటివరకు 26 వేల 673 మంది ఉద్యోగ విరమణ పొంది రెండున్నర సంవత్సరాలు పూర్తి అయిన బకాయిలు పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడం ఈ ప్రభుత్వం ఉద్యోగులకు శాపంగా మారింది.

మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకుండా ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు ఖర్చు చేయడం ఈ ప్రభుత్వానికి అధికారం ఎవరిచ్చారు అని నిలదీయడమైనది. ప్రభుత్వం 100 రోజుల్లో 6000 కోట్లు ఇస్తానని చెప్పి మాకు కాకుండా కాంట్రాక్టర్లకు మరియు వర్కింగ్ ఉద్యోగులకు మా పేరు చెప్పి వారికి ఇవ్వడం జరిగింది. దానివలన మాకు 30% కూడా అందలేదు.

కావున పెన్షనర్లందరూ ఈనెల 13న మంగళవారం నాడు సచివాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టడమైనది. అదేవిధంగా ఇటీవల పెంచిన DA arrears ను ఏక మొత్తంగా At a Time ga (no instalments ) చెల్లించబడాలని డిమాండ్ చేస్తున్నాము.

ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి ఉద్యోగు రావలసిన 16 వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనైనది.

ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు టి మురళీధర స్వామి, జి వెంకటేశ్వర్లు, రమణయ్య, రత్నమాచారి.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad