Mahabubabad: నీటిలో ఈత కొడుతూ ప్రపంచ పటం గీసిన విశ్రాంత ఉపాధ్యాయుడు!
Mahabubabad: మహబూబాబాద్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు చింతకుంట్ల కుమార స్వామి నీటిలో ఈత కొడుతూనే అద్భుతంగా ప్రపంచ పటాన్ని చిత్రించి అబ్బురపరిచారు.
Mahabubabad: నీటిలో ఈత కొడుతూ ప్రపంచ పటం గీసిన విశ్రాంత ఉపాధ్యాయుడు!
మహబూబాబాద్ జిల్లా: సాధారణంగా పెన్సిల్ పట్టుకుని కాగితంపై చిత్రాలు గీయడం చూస్తుంటాం... కానీ నీటిలో ఈత కొడుతూ, తేలియాడే స్థితిలోనే తన ప్రతిభను చాటుకుంటూ అద్భుతమైన చిత్రాన్ని ఆవిష్కరించడం అరుదైన విషయం... అలాంటి వినూత్న ప్రయత్నంతో ప్రపంచ పటాన్ని చిత్రించి ఓ ప్రతిభావంతుడు తన ప్రత్యేకతను చాటుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
మహబూబాబాద్ పట్టణ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు చింతకుంట్ల కుమార స్వామీ నీటిలో ఈత కొడుతూనే అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. నీటిలో ఈత కొడుతూ అద్భుత చిత్రానికి రూపకల్పన.. అందరినీ అబ్బురపరిచిన కళాకారుడి ప్రతిభకళ పట్ల ఉన్న ఆసక్తి, ఏకాగ్రత, సాధనకు ఈ దృశ్యం అద్దం పడుతోంది.
ఇంక కొడుతూ నీటిలో తేలియాడుతూ తన చేతి నుంచి నుంచి జాలువారిన ప్రతి గీత ప్రపంచ పటానికి రూపునివ్వగా, ఆయన సృజనాత్మకత వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది.సాధారణంగా ఊహించని విధంగా, భిన్నమైన వాతావరణంలో కళను ఆవిష్కరించవచ్చని ఈ ప్రయత్నం నిరూపించింది.
ప్రతిభకు పరిస్థితులు అడ్డుకావని, సంకల్పం ఉంటే అసాధ్యమనుకున్న పనులను సైతం సుసాధ్యం చేయవచ్చని ఈ అద్భుత చిత్రం చాటిచెబుతోంది.నీటిలో ఈత.. చేతిలో కళ.. తన చేతి నుంచి ప్రపంచ పటం అంటూ ఈ వినూత్న కళాప్రతిభ పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జ్యోతి, డోలి సత్యనారాయణ, సంక బద్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు.




