Rayaparthi: రాయపర్తిలో CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ రికవరీ!
Rayaparthi: CEIR పోర్టల్ సహాయంతో మిస్సయిన మొబైల్ ఫోన్‌ను గుర్తించి బాధితుడికి అందజేసిన రాయపర్తి ఎస్‌ఐ ముత్యం రాజేందర్.
Rayaparthi: రాయపర్తిలో CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ రికవరీ!
Rayaparthi: మిస్సింగ్ అయిన మొబైల్ ఫోన్‌ను CEIR పోర్టల్ ద్వారా గుర్తించి బాధితుడికి అప్పగించిన ఘటన రాయపర్తిలో చోటుచేసుకుంది.రాయపర్తి ఎస్‌ఐ ముత్యం రాజేందర్ గారు CEIR పోర్టల్ సహాయంతో టీక్య తండాకు చెందిన బానోతు తార్యకు చెందిన మిస్సింగ్ మొబైల్ ఫోన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఆ మొబైల్ ఫోన్‌ను బాధితుడు బానోతు తార్యకు అందజేశారు. మొబైల్ ఫోన్‌ను తిరిగి అందజేసిన ఎస్‌ఐ ముత్యం రాజేందర్‌కు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.




