Hanamkonda: భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో రావు పద్మ రెడ్డి!
Hanamkonda: హనుమకొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో బీజేపీ నేత రావు పద్మ రెడ్డి పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
Hanamkonda: భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకల్లో రావు పద్మ రెడ్డి!
Hanamkonda: హనుమకొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ఆరాధ్య దైవం, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి (జనజాతీయ గౌరవ్ దివస్) వేడుకల్లో బీజేపీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంటెస్టెడ్ కాండిడేట్ శ్రీమతి రావు పద్మ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా నాయకులతో కలిసి భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడిన మహనీయుడు భగవాన్ బిర్సా ముండా అని కొనియాడారు. గిరిజనుల హక్కులు, వారి ఆత్మగౌరవం, అస్తిత్వం మరియు సంప్రదాయాల పరిరక్షణ కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు.
దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన చేసిన అసమాన త్యాగం, పోరాట స్ఫూర్తి, మాతృభూమి పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ నేటి యువతరానికి మరియు మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులి సర్రోతం రెడ్డి, రాష్ట్ర నాయకులు దొంతి దేవేందర్ రెడ్డి, జిల్లా బీజేపీ నాయకులు సండ్ర మధు, అరణ్య రెడ్డి, మలోతు నాను నాయక్, సిరికొండ కవిత, ఋత్విక్ రెడ్డి, వలబోజు శ్రీనివాస్, పిట్టల రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




