Mahabubabad: మహబూబాబాద్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు!
Mahabubabad: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్.
Mahabubabad: మహబూబాబాద్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు!
Mahabubabad: దేశం లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్. డాక్టర్. రామచంద్రు నాయక్ అన్నారు.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ కలెక్టరేట్ లో విప్.రామచంద్రు నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు , అభివృద్ధి కార్యక్రమాలు , నిష్పక్షపాతంగా ప్రజలందరికీ అవినీతి రహితంగా , పార్టీలకు అతీతంగా చేరుతున్నాయని , 80 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని , రైతు భరోసా రైతు , వరి కి బోనస్ , 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు , డిజిటల్ రేషన్ కార్డులు , సన్న బియ్యం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమం లో కలెక్టర్ స్నేహా శభరీష్ , జిల్లా ఎస్పీ శభరీష్ , జిల్లా అధికారులు , పుర ప్రముఖులు పాల్గొన్నారు.




