Parkal: శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు బాధ్యతలు!

Parkal: పరకాల శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌గా మరోసారి బాధ్యతలు స్వీకరించిన కొలుగూరి రాజేశ్వరరావు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని కలిసిన కమిటీ సభ్యులు.

M PRABHAKAR, PARAKAL
Published on: 28 Sept 2026 5:36 PM IST
Parkal
X

Parkal: శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు బాధ్యతలు!

Parkal: పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆశీస్సులతో ఆయనకు మరోసారి అవకాశం దక్కింది.

ఈ సందర్భంగా చైర్మన్ రాజేశ్వరరావుతో పాటు ఆలయ కమిటీ సభ్యులు తోట రవి, రంగు సరోజన, కందుకూరి శ్రీధర్, గౌరిశెట్టి నవీన్, ప్రజాపత్ సావల్ రామ్, గోవిందు సత్యనారాయణ తదితరులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.

గత రెండేళ్లుగా చైర్మన్‌గా ఉన్న రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మహారుద్రయాగం, హిందూ సమ్మేళనం, కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అలాగే ఆలయానికి చెందిన 4 ఎకరాల 11 గుంటల భూమిని తిరిగి ఆలయానికి చెందేలా చేయడంలో ఎమ్మెల్యే కృషి చేశారు.

ప్రస్తుతం ఆలయ మాడవీధుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తుండగా, రాబోయే కార్తీక మాస ఉత్సవాలకు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతిని ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL