Jangaon: వక్ఫ్ భూములను పరిరక్షించాలి: జనగామ కలెక్టరేట్‌లో వినతి

Jangaon: వక్ఫ్ భూములను పరిరక్షించాలని, 22-A నిషేధిత జాబితా నుంచి రైతుల భూములను తొలగించాలని కోరుతూ జనగామ కలెక్టరేట్‌లో బీఆర్ఎస్ మైనార్టీ నేతలు వినతిపత్రం అందజేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 18 Sept 2026 5:35 PM IST
Jangaon
X

Jangaon: వక్ఫ్ భూములను పరిరక్షించాలి: జనగామ కలెక్టరేట్‌లో వినతి

Jangaon: జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు మహమ్మద్ సలీం, మహమ్మద్ యాకూబ్ పాషా, గులాం జానీ, అజ్జు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సెక్షన్ 22/A నిషేధిత జాబితాలో చేర్చబడినటువంటి రైతుల మరియు ప్రైవేటు భూములను వెంటనే తొలగించి జనగామ జిల్లా లోని వక్ఫ్ భూములను పరిరక్షించాలని, ఇప్పటికే అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను గుర్తించి తిరిగి వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

వందల ఎకరాల వక్ఫ్ భూములు అక్రమ కబ్జాలకు గురయ్యాయని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి ఆక్రమణలను గుర్తించాలని కోరారు. అక్రమంగా కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వక్ఫ్ భూములను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

వక్ఫ్ భూములను పరిరక్షించడం ద్వారా ముస్లిం మైనారిటీల హక్కులను కాపాడాలని వారు పేర్కొన్నారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ముస్లిం మైనారిటీలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఐక్యంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా బిఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON