Hanamkonda: హనుమకొండ: ప్రజావాణికి 298 దరఖాస్తులు.. కలెక్టర్ ఆదేశాలు
Hanamkonda: హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 298 అర్జీలు రాగా, వాటిని పెండింగ్ లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు.
Hanamkonda: హనుమకొండ: ప్రజావాణికి 298 దరఖాస్తులు.. కలెక్టర్ ఆదేశాలు
Hanamkonda: సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజావాణి అర్జీలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి స్వీకరించారు. ప్రజల నుండి అందిన ప్రజావాణి అర్జీలను సంబంధిత శాఖల అధికారులను పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అక్కడికక్కడే ఆదేశించారు. అదేవిధంగా వర్చువల్ విధానంలో ఆర్డిఓ, తహసిల్దార్, ఎంపీడీవోలతో ప్రజావాణి అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ మాట్లాడారు.
వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రెవెన్యూ డివిజనల్, మండల స్థాయి లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 298 అర్జీలను సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ... ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలనుండి అందిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
ప్రజలు అందించిన అర్జీలు పెండింగ్ లో ఉండకుండా పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, డిఆర్డివో మేన శీను, సీపీవో సత్యనారాయణ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.




