Bayyaram: బయ్యారంలో పొట్ల రామనర్సయ్య 50వ వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరణ!

Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో గురువారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యదర్శి మోకాళ్ళ మురళీకృష్ణ పొట్ల రామనర్సయ్య 50వ వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరించారు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 19 Nov 2026 4:26 PM IST
Bayyaram
X

Bayyaram: బయ్యారంలో పొట్ల రామనర్సయ్య 50వ వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరణ!

మహబూబాబాద్ జిల్లా: బయ్యారం మండలం కేంద్రంలోని స్థానిక గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ బయ్యారం మండల కార్యదర్శి కామ్రేడ్ మోకాళ్ళ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 50 ఏళ్ల పొట్ల రామనర్సయ్య వర్ధంతి సభను నిర్వహిస్తున్న, సభ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా మోకాళ్ళ మురళీకృష్ణ మాట్లాడుతూ... ఈ సమాజంలో భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటమే నక్సల్బరీ,శ్రీకాకుళం, గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమ పోరాటాలు అని, వాటికి తెలంగాణ ప్రాంతంలో బీజాలు వేసింది పొట్ల రామనర్సయ్య అని, వారన్నారు.

మధ్యతరగతి భూస్వామ్య కుటుంబం నుండి వచ్చిన కామ్రేడ్ రామనర్సయ్య అందరిలాగా తన కోసం,తన కుటుంబం కోసం బ్రతకలేదని, దోపిడీ పాలకుల నుండి ప్రజలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా విముక్తి చేయడం కోసం విప్లవోద్యమ బాట పట్టాడని వారు తెలిపారు.

ఈ క్రమంలో ఎమర్జెన్సీలో వెంగళరావు ప్రభుత్వం మలక్ పేటలో కామ్రేడ్ రామ నర్సయ్యను, అతనితోపాటు జానకి రామిరెడ్డి, శ్రీపాద శ్రీహరి, నారాయణలను పట్టుకొని చిత్రహింసలు పెట్టి చిలకలగుట్ట అడవిలో హత్య చేసి ఎన్కౌంటర్ అని కట్టుకథలు అల్లారని మురళీకృష్ణ విమర్శించారు.

ప్రజల కోసం తమ రక్తాన్ని నిర్మించారని, 50 ఏళ్ల వారి త్యాగాన్ని స్మరిస్తూ వరంగల్ నగరంలో సంస్మరణ సభను నిర్వహించడం జరుగుతుందని, ఈ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ రామగిరి బిక్షం, AIKMS మండల కార్యదర్శి తోకల వెంకన్న, పార్టీ మండల నాయకులు కామ్రేడు మాదంశెట్టి నాగేశ్వరరావు, కామ్రేడ్ మైల యాకన్న, పి వై ఎల్ నాయకులు తుడుం వీరభద్రం, నేతకాని రాకేష్, నాయకులు మింగు భగవాన్, గంగారపు బిక్షం,గుండెబోయిన లింగమల్లు, కొదుమూరి నాగేశ్వరరావు, భూక్య రాము, సజ్జా జలంధర్, పూణేం చిన్న లింగన్న, దేవిరెడ్డి, మెరుగుమల్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM