Warangal: వరంగల్‌లో పద్మశాలీల కార్తీకమాస వనభోజనాల మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ!

Warangal: డిసెంబర్ 6న ఖిలా వరంగల్ వద్ద నిర్వహించనున్న పద్మశాలీల 8వ వార్షిక కార్తీకమాస వనభోజనాల మహోత్సవ పోస్టర్‌ను గురువారం ఈగ మల్లేశం ఆవిష్కరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Nov 2026 5:10 PM IST
Warangal
X

Warangal: వరంగల్‌లో పద్మశాలీల కార్తీకమాస వనభోజనాల మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ!

వరంగల్: వరంగల్ జిల్లా పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పద్మశాలీ 8వ వార్షిక కార్తీక మాస వనభోజనాల మహోత్సవ ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ శ్రీ ఈగ మల్లేశం గారు.

ఖీలా వరంగల్ లోని చింతల్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రవేశద్వారం, ఉత్తరకోట వద్ద ఈ ఉత్సవాలను డిసెంబర్ 06వ తేదీన ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ఉత్సవాలకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్మశాలి కులస్తులందరూ, మహిళలు మరియు యువతీ యువకులు అందరూ కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ మహా సంబురాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆడెపు రవీందర్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాలా నరేందర్, కుస్మ సతీష్, మార్గం ఎల్లయ్య, బి.ఏస్ మూర్తి, కుమార స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్