Hanamkonda: హన్మకొండలో ఘనంగా పద్మశాలీల వనభోజనాల మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ!
Hanamkonda: హసన్పర్తి ఎర్రగట్టు గుట్ట వద్ద నవంబర్ 29న నిర్వహించనున్న పద్మశాలీల కార్తీక మాస వనభోజనాల మహోత్సవ పోస్టర్ను శ్రీ ఈగ మల్లేశం ఆవిష్కరించారు.
Hanamkonda: హన్మకొండలో ఘనంగా పద్మశాలీల వనభోజనాల మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ!
Hanamkonda: తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పద్మశాలీల కార్తీక మాస వనభోజనాల మహోత్సవ ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ శ్రీ ఈగ మల్లేశం గారు
హసన్ పర్తి లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఎర్రగట్టు గుట్ట వద్ద ఈ ఉత్సవాలను నవంబర్ 29 ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ఉత్సవాలకు హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్మశాలి బంధువులు, మహిళలు మరియు యువతీ యువకులు అందరూ కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ మహా సంబురాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.
సమాజానికి మార్కండేయుని జీవితం ఆదర్శమని మానవాళికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తన అచంచలమైన శివభక్తి, పట్టుదల మరియు ఆత్మవిశ్వాసంతో మృత్యువునే జయించి, చిరంజీవిగా నిలిచిన ధీశాలి మార్కండేయుడని కొనియాడారు. ఆయన చూపిన భక్తి, ధర్మ మార్గంలో నడుస్తూ, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తూ సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరారు.
పద్మశాలి సమాజ ఐక్యతను చాటిచెప్పే ఆత్మీయ కలయికని, సామరస్యానికి ప్రతీక అని, పద్మశాలీల కార్తీక మాస వనభోజనాల మహోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. అది మన కుల బాంధవులందరి ఆత్మీయ కలయికని మన సంస్కృతికి సమాజ ఐక్యతను చాటిచెప్పేందుకు ఈ వేదిక మానవాళికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు.
మన ఆరాధ్య దైవం శ్రీ మార్కండేయ స్వామి ఆశీస్సులతో, మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు మన వారసత్వాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మన పద్మశాలి ఆత్మగౌరవ సంబురంలో కుల బాంధవులందరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాలా నరేందర్, వైద్యం రాజగోపాల్, రాష్ట్ర కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్, రాష్ట్ర కార్యదర్శి వెంగళ వేణుగోపాల్,
రాష్ట్ర కమిటీ సభ్యులు బొప్ప శంకర్, గుర్రపు కోటేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కేదాసి వెంకటేశ్వర్లు,దిడ్డి రమేష్, పాము శ్రీనివాస్, గుర్రపు చంద్రశేఖర్, ధూంపేట నరేందర్, గజ్జెల అమరేందర్, దేవులపల్లి సదానందం మరియు తదితరులు పాల్గొన్నారు.




