Mahabubnagar: మహబూబ్‌నగర్ అంగన్వాడీలో ఘనంగా పోషణ మహోత్సవం!

Mahabubnagar: రాయపర్తి మండలం మహబూబ్‌నగర్ అంగన్వాడీలో పోషణ మహోత్సవం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన పౌష్టికాహార విశిష్టతపై సర్పంచ్ పెండ్లి మహేందర్ అవగాహన.

P ASHOK, WARDHANNAPET
Published on: 2 Oct 2026 5:27 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: మహబూబ్‌నగర్ అంగన్వాడీలో ఘనంగా పోషణ మహోత్సవం!

మహబూబ్‌నగర్, అక్టోబర్ 2: రాయపర్తి మండలం మహబూబ్‌నగర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ పెండ్లి మహేందర్ , ఉప సర్పంచ్ చెన్నబోయిన రవి. పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

పోషకాహార లోపాన్ని నివారించేందుకు సమతుల్య ఆహారం తీసుకోవాలని, పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని అంగన్వాడీ సిబ్బంది వివరించారు. స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ SD. యాకుభీ , ఆయా, చిన్నారులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

P ASHOK, WARDHANNAPET

P ASHOK, WARDHANNAPET