Maripeda: మరిపెడ మండలం మూలమరి తండాలో పోలీసుల కార్డెన్ సెర్చ్!

Maripeda: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మూలమరి తండాలో పోలీసుల కార్డెన్ సెర్చ్. శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నిరోధమే లక్ష్యమని వెల్లడి.

P PRABHAKAR, DORNAKAL
Published on: 7 Oct 2026 12:08 PM IST
Maripeda
X

Maripeda: మరిపెడ మండలం మూలమరి తండాలో పోలీసుల కార్డెన్ సెర్చ్!

Maripeda: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని మూలమరి తండా గ్రామపంచాయతీ పరిధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్ఐ గండ్రాతి సతీష్ మాట్లాడుతూ.. ప్రజల భద్రత, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని తెలిపారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అసాంఘిక కార్యకలాపాలు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించి గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తోడ్పడాలని కోరారు. ఈ కార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో సీరోల్ ఎస్ఐ సంతోష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL