Damera: పోలీసు అమరవీరులకు ఘన నివాళి.. దామెరలో క్యాండిల్ ర్యాలీ

Damera: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఈ. వీరభద్రరావు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 26 Oct 2026 8:38 PM IST
Damera
X

Damera: పోలీసు అమరవీరులకు ఘన నివాళి.. దామెరలో క్యాండిల్ ర్యాలీ

దామెర: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఈ. వీరభద్రరావు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ.

విధి నిర్వహణలో దేశ ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ ర్యాలీని చేపట్టారు. పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన వీధుల మీదుగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్సై వీరభద్రరావు మాట్లాడుతూ, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అందించే సేవలు చిరస్మరణీయమని, అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో ప్రతి పోలీసు అధికారి నిబద్ధతతో పని చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL