Maripeda: మరిపెడలో 2 కిలోల గంజాయి స్వాధీనం!
Maripeda: మహబూబాబాద్ జిల్లా మరిపెడలో రూ.లక్ష విలువైన 2 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.
Maripeda: మరిపెడలో 2 కిలోల గంజాయి స్వాధీనం!
Maripeda: మరిపెడ గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై మరిపెడ పోలీసులు ఉక్కుపాదం మోపారు...తొర్రూరు రోడ్డులోని మరిపెడ శివారు డబుల్ బెడ్‌రూం సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు... వారి వద్ద తనిఖీ చేయగా సుమారు రూ.లక్ష విలువైన 2 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, డిజిటల్ వెయింగ్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి మరిపెడ, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం ప్రాంతాల్లో విక్రయించేందుకు సిద్ధమైనట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో పవార్ విజయ్, కంది అభిరామ్, బానోత్ మణిదీపక్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
గంజాయి రవాణా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్ హెచ్చరించారు. గంజాయి సంబంధిత సమాచారం అందించిన వారికి రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ ఆపరేషన్‌లో మరిపెడ ఎస్‌ఐ గండ్రాతి సతీష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




