Mulugu: ములుగులో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు!
Mulugu: ములుగులో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, ఏరియా ఆసుపత్రి రోగులకు పండ్ల పంపిణీ. మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరు.
Mulugu: ములుగులో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు!
ములుగు: భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ములుగు జిల్లాలో నెల రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
ఈ సందర్భంగా ములుగు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ పార్క్‌లో గల మున్సిపాలిటీ అతిధి గృహం లో మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి, వారికి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ గరికపాటి మోహన్ రావు గారు హాజరై, పారిశుద్ధ్య కార్మికులకు తన చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ పట్టణ పరిశుభ్రత కోసం అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, వారి సేవలను గుర్తించి గౌరవించడం సమాజ బాధ్యత అని అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 76వ జన్మదినం సందర్భంగా ఆయనకు ములుగు జిల్లా ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా మాజీ అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజ్మీరా కృష్ణవేణి, భూక్య జవహర్ లాల్,సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కన్వీనర్ నగరపు రమేశ్,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలమంతుల రవీంద్రాచారి,జిల్లా ఉపాధ్యక్షులు జినుకల కృష్ణాకర్ రావు, మేడిశెట్టి ఓమ్రా, భర్తాపురం నరేష్,కోశాధికారి గంగిశెట్టి రాజ్ కుమార్, చందా జ్యోతి, అంతి రెడ్డి రమాదేవి, రేవతి, నిర్మల, మోర్చా అధ్యక్షులు కొర్ర సుమలత, మాదరి శ్రీకాంత్, దండిగ వెంకన్న, మండల అధ్యక్షులు రాయంచు నాగరాజు, బైకాని మహేందర్, మమన్, సంపత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ములుగు జిల్లాలో ప్రజాసేవ, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, సామాజిక సేవలకు సంబంధించిన మరిన్ని కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా నాయకులు తెలిపారు.




