Hanamkonda: పెద్దాపూర్ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు!
Hanamkonda: పెద్దాపూర్ పంచాయతీ నిధుల గోల్‌మాల్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి వినతిపత్రం అందజేసిన వార్డు సభ్యులు. సమగ్ర విచారణకు డిమాండ్.
Hanamkonda: పెద్దాపూర్ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు!
హనుమకొండ: పెద్దాపూర్ గ్రామపంచాయతీలో 15వ సెంట్రల్ ఫైనాన్స్ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు కోరారు. ఈ మేరకు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
గ్రామంలోని 2, 5, 6, 7, 12వ వార్డులకు చెందిన సభ్యులు మాట్లాడుతూ.. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై గతంలో జూన్ 29న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డివిజనల్ పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు జూలై 15న గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన విచారణకు హాజరై తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించినట్లు పేర్కొన్నారు.
అయితే విచారణ పూర్తయినప్పటికీ ఇప్పటివరకు తదుపరి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తమ వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించడం లేదని, వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలని కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాగే పంచాయతీ నిధులకు సంబంధించిన కొన్ని తీర్మానాలపై సంతకాలు చేయాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని వార్డు సభ్యులు పేర్కొన్నారు.
పంచాయతీ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని వారు కలెక్టర్‌ను కోరారు.




