Parkal: పరకాల ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్!

Parkal: పరకాల ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్. మొత్తం 242 ఓట్లకు గాను 166 ఓట్లు పోల్.

M PRABHAKAR, PARAKAL
Published on: 9 Oct 2026 11:25 AM IST
Parkal
X

Parkal: పరకాల ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్!

Parkal: హనుమకొండ జిల్లా పరకాల ఆర్టీసీ బస్సు డిపోలో ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.

ఈరోజు ఉదయం 5 గంటల నుండి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. డిపోలో మొత్తం 242 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు 166 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL