Parkal: పరకాల ప్రభుత్వ ఆస్పత్రిలో దసరా పండగ పూట తీవ్ర రోగుల అవస్థలు!

Parkal: పరకాల 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో దసరా పండగ పూట లేని ఫార్మసిస్టులు. మందులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు. ప్రజాసంఘాలు, రోగుల ఆగ్రహం.

M PRABHAKAR, PARAKAL
Published on: 20 Oct 2026 12:39 PM IST
Parkal
X

Parkal: పరకాల ప్రభుత్వ ఆస్పత్రిలో దసరా పండగ పూట తీవ్ర రోగుల అవస్థలు!

Parkal: హనుమకొండ జిల్లా పరకాలలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో దసరా పండగ పూట ఫార్మసిస్టులు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆసుపత్రిలోని ఫార్మసీ విభాగంలో మందులన్నీ అల్మారాల్లో, టేబుళ్లపై పేరుకుపోయి ఉన్నాయి. కానీ మందులు పంపిణీ చేయాల్సిన ఫార్మసిస్టులు మాత్రం విధుల్లో లేరు. ఫార్మసీ కౌంటర్లు పూర్తిగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ప్రతిరోజూ వందల సంఖ్యలో రోగులు వచ్చే ఈ వంద పడకల ఆసుపత్రిలో ఫార్మసిస్టు పోస్టులు ఖాళీగా ఉండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది మాత్రం దసరా పండుగ కాబట్టి అందుబాటులో ఫార్మసిస్టులు లేరని అన్నారు.

దసరా పండగ పూట ఫార్మసిస్టులు ఉంటారా లేదా అనేదానిపై వివరణ కోసం ఆసుపత్రి సూపరిండెంట్ కి ఫోన్ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రావడం లేదు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL