Parkal: కోతుల బెడదకు చెక్: చింపాంజీ వేషంతో సర్పంచ్ సరికొత్త ఐడియా

Parkal: హనుమకొండ జిల్లా పరకాల మండలం అలియాబాద్‌లో కోతుల బెడదను నివారించేందుకు సర్పంచ్ సనత్ కుమార్ చింపాంజీ వేషధారణతో వినూత్న ప్రయోగం చేసి సఫలమయ్యారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 11 Oct 2026 4:14 PM IST
Parkal
X

Parkal: కోతుల బెడదకు చెక్: చింపాంజీ వేషంతో సర్పంచ్ సరికొత్త ఐడియా

పరకాల: కోతుల బెడదతో విసిగిపోయిన గ్రామానికి సర్పంచ్ వినూత్న ఆలోచనతో ఉపశమనం కలిగించిన ఘటన పరకాల మండలం అలియాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది.

అలియాబాద్ గ్రామంలో గత కొంతకాలంగా కోతుల సంచారం విపరీతంగా పెరిగిపోయింది. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్లడం, పిల్లలపై దాడులు చేయడం, పంటలను నాశనం చేయడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సర్పంచ్ వినూత్న ఆలోచన:

ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ సనత్ కుమార్ సరికొత్త ఆలోచన చేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చింపాంజీ వేషధారణ వేయించి వీధుల్లో తిప్పారు. చింపాంజీని చూసిన కోతులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశాయి. కొద్ది గంటల్లోనే గ్రామం నుండి కోతులు పారిపోయాయని గ్రామస్తులు తెలిపారు.

ప్రశంసల వెల్లువ:

సమస్య పరిష్కారానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్న సర్పంచ్ సనత్ కుమార్ చొరవపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో, ఎవరికీ హాని చేయకుండా సమస్యను పరిష్కరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర గ్రామాలకు ఇది ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు అంటున్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL