Parkal: పరకాల పద్మశాలి భవన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు!

Parkal: పరకాల పద్మశాలి భవన్‌లో ఘనంగా జరిగిన బతుకమ్మ సంబరాలు. సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ఆటపాటలతో వేడుకలు జరుపుకున్న మహిళలు.

M PRABHAKAR, PARAKAL
Published on: 17 Oct 2026 8:13 PM IST
Parkal
X

Parkal: పరకాల పద్మశాలి భవన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు!

పరకాల: పరకాల పట్టణంలోని పద్మశాలి భవన్ లో వేముల సదారాణి ఆంజనేయులు అధ్యక్షతన పద్మశాలి మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఇలా ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని మహిళలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి మహిళా విభాగం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL