Parkal: పరకాల 1వ వార్డులో సైడ్ డ్రైనేజీ పనుల ప్రారంభం కౌన్సిలర్ వెంకటస్వామి

Parkal: పరకాల 1వ వార్డులో సైడ్ డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను ప్రారంభించిన కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు.

M PRABHAKAR, PARAKAL
Published on: 22 Oct 2026 7:34 PM IST
Parkal
X

Parkal: పరకాల 1వ వార్డులో సైడ్ డ్రైనేజీ పనుల ప్రారంభం కౌన్సిలర్ వెంకటస్వామి

పరకాల: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో సైడ్ డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి.

వార్డులోని సీఎస్ఐ అంబేద్కర్ బొమ్మ నుండి ప్రారంభమైన ఈ పనులను వార్డు కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తానని, ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరకాల ఎస్సీ విభాగం అధ్యక్షుడు బొమ్మకంటి చంద్రమౌళి, బీఆర్ఎస్ పార్టీ వార్డు నాయకులు ఒంటేరు శరత్ బాబు, మంద సురేష్, ఒంటేరు అశోక్, మంద నరేష్, ఒంటేరు పరమేష్, బొచ్చు డింపు తదితరులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL