Parkal: పరకాల సాయి నగర్ కాలనీలో యథేచ్ఛగా బెల్ట్ షాప్ దందా
Parkal: పరకాల సాయి నగర్ కాలనీలో బెల్ట్ షాప్ దందా. ప్రైవేట్ స్కూల్ పక్కనే అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్, పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి.
Parkal: పరకాల సాయి నగర్ కాలనీలో యథేచ్ఛగా బెల్ట్ షాప్ దందా
పరకాల: పరకాల పట్టణంలోని సాయి నగర్ కాలనీలో బెల్ట్ షాప్ దందా యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేరుకు కిరాణం షాప్ నడిపిస్తూ చాటుగా రాత్రి పగలు తేడా లేకుండా అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు పాఠశాల పక్కనే ఉండటం, బెల్ట్ షాప్ కారణంగా కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని, మహిళలు, చిన్నారులు బయట తిరగాలంటే భయపడుతున్నారని వాపోతున్నారు.
ఎక్సైజ్, పోలీస్ అధికారులు స్పందించి బెల్ట్ షాప్ పై చర్యలు తీసుకొని కాలనీలో శాంతి భద్రతలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.




