Parkal: పరకాలలో క్రీడా సందడి.. అట్టహాసంగా PPL సీజన్-1 ప్రారంభం!
Parkal: పరకాల పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతల్ మైదానంలో పరకాల ప్రీమియర్ లీగ్ (PPL) సీజన్-1 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.
Parkal: పరకాలలో క్రీడా సందడి.. అట్టహాసంగా PPL సీజన్-1 ప్రారంభం!
Parkal: పరకాల పట్టణంలోని చింతల్ మైదానంలో జరిగిన ప్రారంభోత్సవానికి పరకాల ఎస్ఐ రణధీర్, ప్రముఖ వైద్యులు డాక్టర్ అభిరామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బ్యాట్ తో బంతిని కొట్టి టోర్నమెంట్ ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. నేటి యువత మొబైల్, చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల వైపు దృష్టి పెట్టాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువ క్రికెటర్లకు PPL లాంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయని, తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
టోర్నమెంట్ లో పలు జట్లు తలపడనున్నాయని, ఫైనల్ విజేతలకు భారీ బహుమతులు, ట్రోఫీలతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందజేయనున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు , మరియు ఆర్గనైజర్ చిన్ను , రాజేష్ తెలిపారు.
కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు.




