Parkal: పరకాలలో పోలీసుల విస్తృత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు!
Parkal: పరకాలలో పోలీసుల విస్తృత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై పవన్ హెచ్చరిక.
Parkal: పరకాలలో పోలీసుల విస్తృత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు!
పరకాల: రోడ్డు ప్రమాదాల నివారణకు పరకాల పోలీసులు నడుం బిగించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించి బ్రీత్ ఎనలైజర్ ద్వారా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పరకాల ఎస్సై పవన్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల సొంత ప్రాణాలకే కాకుండా ఎదుటి వారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.
మద్యం తాగి వాహనం నడిపితే కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేయడంతో పాటు జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఎస్సై పవన్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




