Parkal: సిరిసిల్ల సభకు ఆర్టీసీ బస్సుల తరలింపు – ప్రయాణికుల ఇబ్బందులు
Parkal: సిరిసిల్ల సభకు ఆర్టీసీ బస్సులు తరలించడంతో పరకాల బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Parkal: సిరిసిల్ల సభకు ఆర్టీసీ బస్సుల తరలింపు – ప్రయాణికుల ఇబ్బందులు
పరకాల: సిరిసిల్లలో జరిగే సీఎం సభకు ఆర్టీసీ బస్సులను 25 తరలించడంతో పరకాల బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఉదయం నుండి పరకాల నుండి హన్మకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి వెళ్లే బస్సులను సిరిసిల్ల సభకు పంపించడంతో బస్టాండ్‌లో బస్సులు కరువయ్యాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు గంటల తరబడి బస్టాండ్‌లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.
సాధారణ రోజుల్లోనే సరైన సమయానికి బస్సులు రావడం లేదని, ఇప్పుడు సభల పేరుతో ఉన్న బస్సులను కూడా తరలించడంతో తమకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాల్లో అధిక చార్జీలు పెట్టి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.
సభల కోసం బస్సులు తరలించినప్పుడు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, వెంటనే అదనపు బస్సులు నడిపి ఇబ్బందులు తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.




