Parkal: పెద్దరాజుపేటలో ఘనంగా దుర్గామాత ఉత్సవాలు

Parkal: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరాజుపేటలో దేవీ నవరాత్రులు ఘనంగా ముగిశాయి. శోభాయాత్ర అనంతరం చిన్న ఎర్రకుంటలో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేశారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 21 Oct 2026 2:33 PM IST
Parkal
X

Parkal: పెద్దరాజుపేటలో ఘనంగా దుర్గామాత ఉత్సవాలు

పరకాల: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరాజుపేటలో శ్రీ దేవి నవరాత్రి దుర్గామాత ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

పెద్దరాజుపేటలో స్థానిక యూత్ ఆధ్వర్యంలో రెండు చోట్ల అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. స్థానిక యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనకదుర్గ విగ్రహాలకు తొమ్మిది రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు చేశారు. వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

అనంతరం అమ్మవారిని పురవీధుల గుండా కోలాటాలు, డప్పు చప్పుళ్లు, డీజే పాటలతో ఘనంగా ఊరేగించి స్థానిక చిన్న ఎర్రకుంటలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL