Parkal: పరకాల మున్సిపాలిటీలో 6 నూతన స్వచ్ఛ ఆటోల పూజా కార్యక్రమం!
Parkal: హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త సేకరణ కోసం నూతనంగా కేటాయించిన 6 స్వచ్ఛ ఆటోల పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
Parkal: పరకాల మున్సిపాలిటీలో 6 నూతన స్వచ్ఛ ఆటోల పూజా కార్యక్రమం!
Parkal: పరకాల మున్సిపాలిటీలో తడి చెత్త, పొడి చెత్త సేకరణ కోసం నూతనంగా కేటాయించిన స్వచ్ఛ ఆటోల పూజా కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ పవన్, చైర్ పర్సన్ పావుశెట్టి సునీల్ కుమార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల మున్సిపాలిటీ పరిధిలో ఆటోల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారం ఆరు స్వచ్ఛ ఆటోలను కేటాయించడం జరిగిందన్నారు.
ఈ ఆటోల ద్వారా ప్రతి వార్డులో ప్రతిరోజూ తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతామన్నారు. ప్రజలు కూడా చెత్తను వేరుచేసి సిబ్బందికి అందించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.




