Parkal: పాడి గేదెల పెంపకంతో స్థిరమైన ఆదాయం: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి!

Parkal: ఆత్మకూరు మండలంలో ఎస్సీ కార్పొరేషన్ పాడి గేదెలను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శ్వేత విప్లవంతో గ్రామీణ ఆర్థిక బలోపేతం, పరకాల ఇందిరా డైరీ ఏర్పాటు.

M PRABHAKAR, PARAKAL
Published on: 29 Sept 2026 9:18 PM IST
Parkal
X

Parkal: పాడి గేదెల పెంపకంతో స్థిరమైన ఆదాయం: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి!

Parkal: హనుమకొండ జిల్లా.. ఆత్మకూరు మండలం అక్కంపేట,కామారం, పెంచికల పేట, నీరుకుల్లా గ్రామాలలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన పాడి గేదెలను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే పరిశీలించారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా కుటుంబాలకు స్థిరమైన ఆదాయం లభించి, వారు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి కుటుంబం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. శ్వేత విప్లవం తీసుకురావడంలో భాగంగా దామెరలో మహిళలతో పరకాల ఇందిరా మహిళా డైరీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

రాబోయే రెండు సంవత్సరాలలో 40 వేల కుటుంబాలను డైరీలో చేర్చుతామని అన్నారు. పాడి గేదెలను సక్రమంగా సంరక్షిస్తూ, పాడి ఉత్పత్తిని పెంచుకొని అదనపు ఆదాయం పొందాలని లబ్ధిదారులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలను వినియోగించుకొని కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL