Parkal: పరకాలలో ఏటీసీ సెంటర్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి!

Parkal: పరకాల మున్సిపల్ ఆఫీస్ పక్కన ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) స్థలాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 6 Nov 2026 7:57 PM IST
Parkal
X

Parkal: పరకాలలో ఏటీసీ సెంటర్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి!

పరకాల: పరకాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఏటీసీ (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) సెంటర్ నిర్మాణానికి కసరత్తు వేగవంతమైంది. నూతన మున్సిపల్ కార్యాలయం పక్కన ఈ సెంటర్ కోసం కేటాయించిన స్థలాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులు, ఇంజనీర్లతో కలిసి స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, భవన నమూనా, డిజైన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెంటర్ లో ఎలాంటి సౌకర్యాలు ఉండాలో, నిర్మాణానికి ఎంత సమయం పడుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ ఏటీసీ సెంటర్ నిర్మాణం పూర్తయితే పరకాల నియోజకవర్గంలోని స్థానిక యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సాంకేతిక శిక్షణ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుని ఉద్యోగాలు, స్వయం ఉపాధి పొందే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL