Nadikuda: నడికుడలో పీహెచ్‌సీ ప్రారంభించిన రేవూరి ప్రకాశ్ రెడ్డి

Nadikuda: హనుమకొండ జిల్లా నడికుడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పీహెచ్‌సీని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, డీఎంహెచ్‌ఓ అప్పయ్య ప్రారంభించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 26 Oct 2026 2:43 PM IST
Nadikuda
X

Nadikuda: నడికుడలో పీహెచ్‌సీ ప్రారంభించిన రేవూరి ప్రకాశ్ రెడ్డి

నడికుడ: నడికుడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మరియు డిఎంహెచ్ ఓ అప్పయ్య తో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. నడికుడ పరిసర గ్రామాల ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని, ఈ PHC అందుబాటులోకి రావడం వల్ల అత్యవసర సమయంలో హనుమకొండ, పరకాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వైద్యం అందుతుందని తెలిపారు.

ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ వైద్య సేవలు చేరేలా కృషి చేస్తామని, వైద్య సిబ్బంది కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL