Parkal: ఆధునిక పోకడలతో చేనేతకు ఉజ్వల భవిత: ఎమ్మెల్యే రేవూరి!
Parkal: హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారంలో చేనేత సహకార సంఘం కార్పొరేట్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.
Parkal: ఆధునిక పోకడలతో చేనేతకు ఉజ్వల భవిత: ఎమ్మెల్యే రేవూరి!
పరకాల: పరకాల మండలంలోని నాగారం గ్రామంలోని చేనేత సహకార సంఘంలో నూతన కార్పొరేట్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎం విజయలక్ష్మి ఏ డి (హెచ్ & టి)హనుమకొండ, బొట్టు వెంకటేశ్వర్లు ఏ డి(హెచ్ & టి)డి ఎం ఓ వరంగల్, కృష్ణ మోహన్ ఏజీఎం డబ్ల్యూ డి సి సి బ్యాంక్ హనుమకొండ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్పొరేట్ తరహా ఉత్పత్తులతో చేనేతకు మరింత డిమాండ్ పెరుగుతుందని అన్నారు. ఆధునిక డిజైన్లతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు తయారు చేస్తే చేనేతకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దాసరి బిక్షపతి అధ్యక్షుడు, రఘుపతి ఉపాధ్యక్షులు, వావిలాల రాజసమ్మయ్య కార్యదర్శి, గాజర్ల రాజేందర్ కోశాధికారి, కంబత్తుల సాంబయ్య, దాసరి రాజమణి, మంత్రి మహేశ్వరి, శ్యామల మహేందర్, మెండు రాజేందర్ చేనేత సంఘం నాయకులు, సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.




