Parkal: పరకాలలో మహిళను కత్తితో బెదిరించిన నిందితుడి అరెస్ట్!
Parkal: పరకాలలో మహిళను కత్తితో బెదిరించి వేధించిన నిందితుడి అరెస్ట్. ఆరు నెలలుగా వేధింపులు, దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు.
Parkal: పరకాలలో మహిళను కత్తితో బెదిరించిన నిందితుడి అరెస్ట్!
Parkal: పరకాల పట్టణంలో మహిళను కత్తితో బెదిరించి వేధించిన నిందితుడిని పరకాల పోలీసులు అరెస్ట్ చేశారు. పరకాల పట్టణంలోని బట్టల దుకాణం మరియు వాణి బుక్ స్టాల్ గల్లీలోని ఓ కిరాణా షాప్ వద్ద 28.10.2026 తేదీన ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. బాధితురాలి భర్త ఐదు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, ఆమెకు 13 ఏళ్ల కుమారుడు అభిరామ్ ఉన్నాడు. కుటుంబ పోషణ కోసం ఆమె పరకాలలోని బట్టల దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.
గత ఆరు నెలలుగా కొమ్ముల శ్రీనివాస్, తండ్రి సారయ్య, వయసు 30 ఏళ్లు అనే వ్యక్తి ఆమెను వెంటపడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఇష్టం లేని అక్రమ సంబంధానికి ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక ఆమె తన పని స్థలాన్ని మార్చుకుని మార్కెట్ సమీపంలోని కిరాణా షాపులో చేరింది.
అయినా వదలని నిందితుడు 28న ఆమె కొత్త పని ప్రదేశానికి వచ్చి మళ్లీ అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా చేతులతో దాడి చేసి, కత్తి చూపిస్తూ చంపుతానని బెదిరించాడు. ఆమె కుటుంబ సభ్యులను కూడా బెదిరించాడు.
దీంతో బాధితురాలు పరకాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




