Parkal: పరకాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దీపావళి భద్రతా అవగాహన!

Parkal: దీపావళి పండగను పురస్కరించుకుని పరకాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టపాసులు, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఫైర్ ఆఫీసర్.

M PRABHAKAR, PARAKAL
Published on: 4 Nov 2026 12:58 PM IST
Parkal
X

Parkal: దీపావళి పండగ పురస్కరించుకొని టపాసుల వలన జరిగే అగ్ని ప్రమాదాల నివారణపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ ఆఫీసర్ మాట్లాడుతూ మాట్లాడుతూ, టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని, మండుతున్న దీపాల దగ్గర, పెట్రోల్, గ్యాస్ వంటి మండే పదార్థాల దగ్గర టపాసులు కాల్చవద్దని సూచించారు.

ప్రమాదం జరిగితే వెంటనే ఏం చేయాలో, అగ్ని ప్రమాదాల నుంచి ఎలా రక్షించుకోవాలో విద్యార్థులకు తెలియజేశారు. దీపావళిని సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL