Parkal: పరకాల ఆలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు

Parkal: పరకాల శ్రీ భవాని కుంకుమేశ్వర ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు నాగదేవతకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 13 Nov 2026 2:01 PM IST
Parkal
X

Parkal: పరకాల ఆలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు

పరకాల: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.

తెల్లవారుజాము నుండే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. నాగదేవతల విగ్రహాలకు, పుట్టలకు పాలు, పెరుగుతో అభిషేకాలు చేసి, పసుపు, కుంకుమ, పూలతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

సంతాన భాగ్యం, కుటుంబ సౌభాగ్యం, ఆరోగ్యం, సుఖసంతోషాల కోసం మహిళలు ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. నాగదేవతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తిపారవశ్యంతో పూజలు చేశారు.

కార్తీక మాసం పురస్కరించుకొని ప్రతిరోజు అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వర రావు తెలిపారు.

ఆలయ ప్రాంగణమంతా భక్తిభావంతో నిండిపోగా, ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL