Parkal: రావణాసుర వధ ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్!

Parkal: పరకాల పట్టణంలో నిర్వహించనున్న దసరా వేడుకలు, రావణాసుర వధ ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 19 Oct 2026 8:26 PM IST
Parkal
X

Parkal: రావణాసుర వధ ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్!

పరకాల: దసరా పండుగను పురస్కరించుకుని రేపు పరకాల పట్టణంలో నిర్వహించనున్న ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ సోమవారం పరిశీలించారు.

పట్టణంలోని బొడ్రాయి ప్రాంతం మరియు అంగడి మైదానంలో జరగనున్న రావణాసుర వధ కార్యక్రమ ఏర్పాట్ల పనులు ఎంతవరకు వచ్చాయో ఆయన అధికారులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బొడ్రాయి వద్ద లైటింగ్, సౌండ్ సిస్టం, బారికేడ్ల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సిబ్బందికి సూచించారు. భక్తులకు తాగునీరు, పార్కింగ్ వసతులు కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు ఉన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL