Parkal: ఈ నెల 26న చలో హైదరాబాద్ జయప్రదం చేయాలని సీఐటీయూ పిలుపు!
Parkal: కార్మికుల సమస్యలపై ఈ నెల 26న ఇందిరా పార్క్ వద్ద 'చలో హైదరాబాద్'. పరకాలలో సీఐటీయూ పోస్టర్ ఆవిష్కరణ, కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్.
Parkal: ఈ నెల 26న చలో హైదరాబాద్ జయప్రదం చేయాలని సీఐటీయూ పిలుపు!
పరకాల: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి బోట్ల చక్రపాణి పిలుపునిచ్చారు. పరకాలలోని అమరధామంలో సీఐటీయూ కార్మికుల అధ్యక్షుడు మడికొండ ప్రమోద్ కుమార్ చలో హైదరాబాద్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ, అంగన్ వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులకు పీఆర్సీ ప్రకటించి కనీస వేతనం రూ.30 వేలు అమలు చేయాలని, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని, జీవో నం.6 పకడ్బందీగా అమలు చేయాలని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు, కాలనీలు ఏర్పాటు చేయాలని, 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ పరకాల మండల నాయకులు బొచ్చు ఆదాం, పి.సమ్మక్క, బయ్య కృష్ణంరాజు, పసుల సారయ్య, చెరుకు వేణు, ఎం.సుధాకర్, బొచ్చు సామెల్, ఒంటె ప్రకాశ్, గూడెల్లి వెంకటేష్, రమేష్ తదితర కార్మికులు పాల్గొన్నారు.




