Parkal: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన చర్లపల్లి సర్పంచ్

Parkal: పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు షాక్. కాంగ్రెస్‌లో చేరిన చర్లపల్లి సర్పంచ్ బండి రేణుక శంకర్. కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.

M PRABHAKAR, PARAKAL
Published on: 29 Oct 2026 6:00 PM IST
Parkal
X

Parkal: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన చర్లపల్లి సర్పంచ్

పరకాల: పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. చర్లపల్లి గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ తో పాటు 20 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బండి రేణుక శంకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL