Parkal: యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి పరకాలలో బీజేవైఎం నిరసన!

Parkal: పరకాలలో యూత్ డిక్లరేషన్ హామీల అమలు కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రూ.4 వేల భృతి, ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్.

M PRABHAKAR, PARAKAL
Published on: 17 Oct 2026 4:53 PM IST
Parkal
X

Parkal: యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి పరకాలలో బీజేవైఎం నిరసన!

పరకాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో పరకాలలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పరకాల పట్టణ బీజేవైఎం అధ్యక్షుడు దాసరి ప్రణీత్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం నుండి బస్టాండ్ లోని అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ లో ప్రకటించిన నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రాజీవ్ యువ వికాసం, విద్యార్థినులకు స్కూటీ హామీల అమలులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యువత హక్కుల కోసం బీజేవైఎం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సయ్యద్ గాలిఫ్ ఇన్‌చార్జిగా వ్యవహరించగా, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొలనుపాక రేవన్ సిద్ధు, క్రాంతి కుమార్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి కక్కు రాజు, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ వెంకటరమణ, సెంట్రల్ స్కీమ్ కన్వీనర్ మాచవేణి అశోక్, జాయింట్ సెక్రటరీ చెక్క సతీష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాంబారి విగ్నేష్ పాల్గొన్నారు.

అలాగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సంతోష్ కుమార్, పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్, కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్, పరకాల మండల అధ్యక్షుడు రాజకుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, దామెర మండల ప్రధాన కార్యదర్శి ముకేశ్, బీజేవైఎం మండల అధ్యక్షులు రేగూరి శశిధర్ రెడ్డి, తాళ్లపల్లి హరికృష్ణ, శివ, రాచర్ల నరేష్, పోతరాజు శ్రీకాంత్, పసరుగొండ ఉపసర్పంచ్ మంద మనోజ్ తో పాటు పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL