Parkal: ప్రొఫెసర్ గడ్డం భాస్కర్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి బీసీ సంఘాలు!

Parkal: పరకాలలో బీసీ సంఘాల మీడియా సమావేశం. పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ గడ్డం భాస్కర్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి.

M PRABHAKAR, PARAKAL
Published on: 4 Nov 2026 2:45 PM IST
Parkal
X

Parkal: పరకాల రిటైర్డ్ ఉద్యోగుల కార్యాలయంలో బీసీ సంఘాల మీడియా సమావేశం. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరకాల, పద్మశాలీ సమాజానికి శాసనమండలిలో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని వివిధ బీసీ కుల సంఘాలు కోరారు.

కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని, గాంధీ జయంతి రోజున సిరిసిల్లలో పద్మశాలీలకు ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. చేనేత రంగంపై, విద్యా-పరిశోధన రంగాల్లో విశేష అనుభవం ఉన్న ప్రొఫెసర్ భాస్కర్ కు అవకాశం ఇస్తే చేనేత కార్మికుల సమస్యలు, బీసీ వర్గాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రొఫెసర్ భాస్కర్ 51 పరిశోధనా పత్రాలు ప్రచురించారని, తెలంగాణ ఉద్యమంలో, కొండా లక్ష్మణ్ బాపూజీ మార్గదర్శకత్వంలో చేనేత రంగానికి సేవ చేశారని గుర్తు చేశారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL