Hanamkonda: పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి తనిఖీలు!

Hanamkonda: పరకాల నూతన ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు త్వరగా ప్రారంభించాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆదేశం. ఆసుపత్రి భవనం, మౌలిక వసతుల క్షేత్రస్థాయి పరిశీలన.

M PRABHAKAR, PARAKAL
Published on: 22 Sept 2026 4:08 PM IST
Hanamkonda
X

Hanamkonda: పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి తనిఖీలు!

Hanamkonda: పరకాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలను త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు.

మంగళవారం పరకాల నూతన ఏరియా ఆసుపత్రి భవనంలో కల్పించిన మౌలిక సదుపాయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రేడియాలజీ విభాగం, లేబర్ రూములు, బ్లడ్ బ్యాంక్, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ విభాగాలను ఏర్పాటు చేయగా, మొదటి అంతస్తులో ఓపీ బ్లాక్, సూపరింటెండెంట్ కార్యాలయం, పరిపాలనా విభాగంతో పాటు నియోనాటల్ కేర్ యూనిట్, ఐసోలేషన్ వార్డులు, ఐసీటిసి క్లినికల్ సేవలకు సంబంధించిన కేంద్రాల ఏర్పాటు,

రెండో అంతస్తులో పీడియాట్రిక్, ప్రసవానంతర (పోస్ట్‌నేటల్), గర్భిణీల (యాంటీనేటల్), ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ, ఆప్తాల్మాజీ,, జనరల్ మెడిసిన్, పురుషులు, మహిళలకు సంబంధించిన వార్డులు, పెయింగ్ రూమ్స్, పాథాలజీ విభాగానికి సంబంధించిన గదులను, మూడో అంతస్తులో ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ, జనరల్ సర్జరీ పురుషులు, మహిళల వార్డులను ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలు, వైద్య సేవలకు సంబంధించిన మౌలిక వసతులను పరిశీలించారు. ఆయా విభాగాలను కలెక్టర్ సందర్శించి వాటి వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ, సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పాత ఆసుపత్రి నుంచి నూతన ఆసుపత్రిలోకి అన్ని విభాగాలను తరలించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రిలో విద్యుత్ పనులు నాణ్యతతో ఉండాలని, ఆక్సీజన్ పైప్ లైన్స్ పనులు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సందర్భంగా పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నందు పటేల్, పరకాల ఆర్డీవో డిఎస్. వెంకన్న, తహసీల్దార్ విజయలక్ష్మి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL