Parakal: పరకాల-అంబాల రోడ్డులో దుమ్ము దుమారం!
Parakal: పరకాల-అంబాల రహదారి నిర్మాణంలో కంకర పోసి వదిలేయడంతో చెలరేగుతున్న దుమ్ము. పంటలు నాశనమై నష్టపోతున్నామని రైతులు, వాహనదారులు తీవ్ర ఆవేదన.
Parakal: పరకాల-అంబాల రోడ్డులో దుమ్ము దుమారం!
Parakal: పరకాల నుంచి అంబాల, హనుమకొండ వరకు నిర్మిస్తున్న రోడ్డు వాహనదారులకే కాదు, రైతుల పాలిట శాపంగా మారింది. కంకర పోసి వదిలేయడంతో లేస్తున్న దుమ్ము రోడ్డుకు ఇరువైపులా ఉన్న పంట పొలాలపై పడి పంటలు నాశనమవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వాహనం వెళ్తే చాలు దట్టమైన దుమ్ము తెర లేచి ఎదుటి వాహనం కనిపించక ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొందని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని, వెంటనే నీళ్లు చల్లి దుమ్ము అదుపు చేయాలని రైతులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.




