Hanumakonda: పోలీస్ స్టేషన్ పక్కనే దొంగల బీభత్సం.. పంచాయతీ ఆటో టైర్లు మాయం!
Hanumakonda: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ సమీపంలో గ్రామపంచాయతీ చెత్త ఆటో టైర్లు చోరీకి గురయ్యాయి.
Hanumakonda: పోలీస్ స్టేషన్ పక్కనే దొంగల బీభత్సం.. పంచాయతీ ఆటో టైర్లు మాయం!
Hanumakonda: ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామంలో వింత దొంగతనం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఉన్న గ్రామపంచాయతీ చెత్త ఆటో టైర్లను గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు.
తిరుమలగిరి గ్రామపంచాయతీకి చెందిన చెత్త సేకరణ ఆటోలోని రెండు టైర్లను దుండగులు అపహరించారు. టైర్లు మాయం కావడంతో గత నాలుగు రోజులుగా గ్రామంలో చెత్త సేకరణ పూర్తిగా నిలిచిపోయింది.
చెత్త సేకరణ ఆగిపోవడంతో ఇళ్ల ముందు, వీధుల్లో చెత్త పేరుకుపోయి తీవ్ర దుర్వాసన వస్తోంది. దీంతో దోమల బెడద పెరిగి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పోలీస్ స్టేషన్ పక్కనే చోరీ జరిగినా ఇంతవరకు నిందితులను గుర్తించలేకపోవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచడంతో పాటు గ్రామంలో సీసీ నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.




